నూతన మ౦త్రి మ౦డలి

రాష్ట్ర మంత్రివర్గ‌ విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్‌ జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ జాబితా ప్రకారం ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో ప్రాతినిధ్యం దక్కనుంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని విశ్వసనీయంగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మహిళా, గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ […]

నూతన మ౦త్రి మ౦డలి

Edited By:

Updated on: Oct 18, 2020 | 9:18 PM

రాష్ట్ర మంత్రివర్గ‌ విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్‌ జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ జాబితా ప్రకారం ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో ప్రాతినిధ్యం దక్కనుంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని విశ్వసనీయంగా తెలిసింది.

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మహిళా, గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. మంత్రి పదవులకు తొమ్మిది మంది పేర్లు ఖరారయ్యాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత మంత్రివర్గంలో పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మరోసారి అవకాశం దక్కనుంది