బాలుడి కిడ్నాప్..రూ. 45 లక్షలు ఇవ్వాలంటూ కాల్స్

మహబూబాబాద్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది.‌ అప్పటివరకు తండ్రితో కలిసి షాపింగ్‌ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్‌ కావడం మిస్టరీగా మారింది.

బాలుడి కిడ్నాప్..రూ. 45 లక్షలు ఇవ్వాలంటూ కాల్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 20, 2020 | 4:26 PM

మహబూబాబాద్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది.‌ అప్పటివరకు తండ్రితో కలిసి షాపింగ్‌ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్‌ కావడం మిస్టరీగా మారింది. వివరాల్లోకి  వెళ్తే.. మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్‌ వీడియో జర్నలిస్టు కుసుమ రంజిత్ కుమారుడు దీక్షిత్‌ (9) ఆదివారం మిత్రులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు. సోమవారం రాత్రి వరకు బాలుడి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.40 నిమిషాలకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు ‘మీ బాబు క్షేమంగా ఉండాలంటే రూ.45 లక్షలివ్వాలి.. రేపు ఉదయం డబ్బు ఎక్కడికి వచ్చి ఇవ్వాలో చెబుతాం’ అని అన్నారు. దీంతో బాబు పోలీసులకు కంప్లైంట్ చేయగా పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా వచ్చి బాలుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  నివాస ప్రాంతాలను పరిశీలించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది సిబ్బందితో స్పెషల్ టీమ్స్  బాలుడి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నాయి. కిడ్నాపర్లు తెలివిగా వ్యవహరిస్తూ వివిధ నంబర్ల నుంచి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తూ ఉండటంతో ట్రేస్‌ చేయడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. బాలుడిని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కాలనీలోని సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

Also Read  :

దేశంలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..?

బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెండ్