దేశంలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..?

దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.  కొత్తగా 46,791 కేసులు నమోదైనట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..?
Follow us

|

Updated on: Oct 20, 2020 | 4:32 PM

దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.  కొత్తగా 46,791 కేసులు నమోదైనట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 587మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులో 69,720మంది వ్యాధి నుంచి బయటపడ్డారు. కాగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75,97,064కు చేరింది. ప్రస్తుతం 7,48,538 యాక్టివ్​ కేసులున్నాయి. కరోనా కారణంగా దేశంలో మొత్తం 1,15,197 మంది మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండగా… రికవరీల రేటు పెరుగుతోంది. ఇవే ఇప్పుడు మనకు ఊరటనిచ్చే అంశాలు.  దాదాపు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా డెత్  రేటు 1.52 శాతంగా ఉందని హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన మూడు నెలల్లో 50,000 లోపు కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

Also Read :

టీవీ9 ‘ఆపరేషన్‌ చార్లి’ ఎఫెక్ట్, సీటీలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు

ఉదయ్ ‘మనసంతా నువ్వే’కి 19ఏళ్లు.. ఎమ్మెస్ రాజు ‌ఎమోషనల్