AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 ఏళ్ల నాటి తెహల్కా కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎడిటర్‌ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష!

బాంబే హైకోర్టు గోవా బెంచ్ 2013 అత్యాచారం కేసులో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన ధర్మాసనం ఆయనకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే రెండు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది..

13 ఏళ్ల నాటి తెహల్కా కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎడిటర్‌ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష!
Tehelka Former Editor Tarun Tejpal Case
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 3:26 PM

Share

2013లో జరిగిన అత్యాచారం కేసులో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు గోవా బెంచ్ దోషిగా తేల్చింది. జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన ధర్మాసనం తరుణ్ తేజ్‌పాల్‌ కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 5 లక్షల జరిమానా విధించి, రెండు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.2021లో మాపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషిగా ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. గోవా ప్రభుత్వం సమర్పించిన అప్పీల్‌పై సమగ్ర విచారణ జరిపిన తర్వాత అత్యాచారం కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ ను దోషిగా తేల్చింది..హైకోర్టు తీర్పుపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే?

2013 నవంబర్ 7, 8 తేదీలలో గోవాలోని బంబోలిమ్ గ్రాండ్ హైయాట్ హోటల్‌లో తెహల్కా థింక్ ఫెస్ట్ కార్యక్రమం సమయంలో జూనియర్ ఉద్యోగిని ఎలివేటర్‌లో రెండుసార్లు లైంగికంగా వేధించి తరుణ్ తేజ్‌పాల్‌ అత్యాచారం చేశారు.. తెహల్కా సంస్థ ఎడిటర్‌గా ఉండి బలవంతం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి 2013 నవంబర్ 23న FIR నమోదైంది. నవంబర్ 30న తేజ్‌పాల్ అరెస్టయ్యారు..సుమారు ఏడు నెలలు జైలులో ఉన్న ఆయనకు 2014లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021 మేలో మాపుసా సెషన్స్ కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు ఆయనను IPC సెక్షన్ 376(2)(f), 376(2)(k), 354A, 354B కింద దోషిగా తేల్చింది. సెక్షన్ 376 కింద కనీసం 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు…అందులో భాగంగా 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు విధించింది.

Follow Us