హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. రెండు కారిడార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అసెంబ్లీ స్టేషన్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ… స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’…