AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suseenthiran Clarifies: తనమీద జరుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన దర్శకుడు.. నిధిని అందుకే అలా అన్నాను అంటూ క్లారిటీ..

Suseenthiran Clarifies About Niddhi Aggarwal: ఈస్మార్ట్‌ శంకర్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సంపాదించుకుంది నటి నిధి అగర్వాల్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం..

Suseenthiran Clarifies: తనమీద జరుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన దర్శకుడు.. నిధిని అందుకే అలా అన్నాను అంటూ క్లారిటీ..
Narender Vaitla
|

Updated on: Jan 05, 2021 | 11:32 AM

Share

Suseenthiran Clarifies About Niddhi Aggarwal: ఈస్మార్ట్‌ శంకర్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సంపాదించుకుంది నటి నిధి అగర్వాల్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించడంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే తమిళంలో శింబు సరసన  ‘ఈశ్వరన్‌’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. సుశీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ క్రమంలో నిధిఅగర్వాల్‌తో పాటు దర్శకుడు సుశీంద్రన్ వేదికపైకి వచ్చాడు. ఈ సమయంలో నిధిని దర్శకుడు ఆటపట్టించాడు. ఈ సందర్భంగా హీరో శింబును ఉద్దేశించి.. ‘శింబు మామా ఐ లవ్‌ యూ’ అని చెప్పమని నిధి అగర్వాల్‌ను సుశీంద్రన్‌ ఒత్తిడి చేశాడు. దీనికి నిధి తిరస్కరించింది. అయితే అనంతరం ఈ అంశంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హీరోయిన్‌ను అలా ఇబ్బంది పెడతారా అంటూ సుశీంద్రన్‌ నెగిటివ్‌ కామెంట్స్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంశంపై దర్శకుడు మరోసారి స్పందించాల్సి వచ్చింది. ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ఉద్దేశంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో ‘మామా.. మామా ఐ లవ్యూ’ అంటూ హీరో శింబు వెంటపడే పాత్రలో నిధి అగర్వాల్‌ నటించిందని, అందుకే తాను ఆడియో లాంచ్‌ వేదికపై ఆ డైలాగ్‌ చెప్పాలని హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ను కోరానని, అంతేకానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా ఈ నెల13న విడుదలకానుంది.

Also Read: Nabha Natesh : ఈ ఇస్మార్ట్ బ్యూటీకి సౌత్ ఇండియన్ మాస్ సినిమాలంటే చాలా ఇష్టమట..!

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?