Mohammed Siraj : మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గౌరవం..కెప్టెన్ నిర్ణయంపై నెటిజన్ల హర్షం..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మన హైదరాబాదీ యంగ్ మెన్ మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రెండో టెస్ట్ టీ విరామ సమయంలో డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు...

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గౌరవం..కెప్టెన్ నిర్ణయంపై నెటిజన్ల హర్షం..

Updated on: Dec 26, 2020 | 3:48 PM

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మన హైదరాబాదీ యంగ్ మెన్ మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రెండో టెస్ట్ టీ విరామ సమయంలో డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు టీమిండియాను సిరాజ్ లీడ్ చేశాడు. కెప్టెన్ రహానే సూచన మేరకు సిరాజ్ఇలా చేయగా.. ఇదే మేం సిరాజ్‌కు ఇచ్చే గౌరవం అని కెప్టెన్ తెలిపాడు. రహానె నిర్ణయం పట్ల టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

టీ విరామం సమయంలో టీమిండియా కెప్టెన్‌ రహానే సిరాజ్‌ వద్దకు వెళ్లి.. నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని సూచించాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్‌ ముందు నడవగా.. జట్టు సభ్యులు మొత్తం అతని వెనకాల నడిచారు. టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు మేము ఇచ్చే గౌరవం ఇదే అంటూ రహానే వెల్లడించాడు.

రహానే చర్యపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. కెప్టెన్ రహానే చర్యను సోషల్ మీడియా తెగ పొగిడేస్తోంది.  ఒక టెస్ట్ డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే సాధ్యామైందంటూ కాంమెంట్స పెడుతున్నారు. ఇక తొలి రోజు తన సత్తా చూపించాడు. బుషేన్‌ను ఔట్ చేయడంతో సిరాజ్‌ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్‌ వికెట్‌ సొంతం చేసుకున్నాడు.

భారత బౌలర్లు విజృంభించడంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ప్రత్యర్థి​ బ్యాట్స్​మెన్​ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్​ అయింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.