వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి నాని సినిమాలు.. ట్రిపుల్ బోనాంజాకు ప్లాన్ చేస్తున్న నేచురల్ స్టార్..

విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారాడు నేచురల్ స్టార్ హీరో నాని. కానీ ఈ మధ్య నాని కెరిర్‏లో వరుస అపజయాలు వస్తున్నాయి.

  • Rajitha Chanti
  • Publish Date - 3:36 pm, Sat, 26 December 20
వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి నాని సినిమాలు.. ట్రిపుల్ బోనాంజాకు ప్లాన్ చేస్తున్న నేచురల్ స్టార్..

విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారాడు నేచురల్ స్టార్ హీరో నాని. కానీ ఈ మధ్య నాని కెరిర్‏లో వరుస అపజయాలు వస్తున్నాయి. దీంతో ఈసారి కథతో పాటు అనుభవం ఉన్న డైరెక్టర్స్‏తో సినిమాలు చేయడం మంచిదని నాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతోనే చిత్రాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ ఏడాది థియేటర్లు మూతపడడంతో నాని నటించిన వి సినిమా నిరాశ పరచడంతో.. వచ్చే ఏడాది మూడు సినిమాలు విడుదలయ్యేలా నాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా వచ్చే ఏడాది ఎప్రిల్ 2021లో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డైరెక్టర్ మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మళ్ళీ నాని, శివనిర్వాణ కాంబినేషన్‏లో టక్ జగదీష్ సినిమా రాబోతుంది. ఇటీవల విడుదల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతోపాటే ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అటు ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది ఆగస్ట్‏లో విడుదల చేయనున్నారు. కోల్‏కత్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిదా హీరోయిన్ సాయిపల్లవి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీటితో పాటు ‘అంటే సుందరానికి’ సినిమాలో కూడా నాని నటిస్తున్నాడు. బ్రోచేవారెవరురా మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాడు. అటు ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరంలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఒకే ఏడాదిలో 3 సినిమాలను విడుదల చేసి భారీ హిట్ సాధించాలని నాని ప్లాన్ చేస్తున్నాడట.