TikTok Videos: స్కూల్లో టిక్ టాక్ డ్యాన్స్‌లు.. టీచర్ల సస్పెన్షన్..!

అవును స్కూల్లో ప్రెండ్లీ వాతావరణం ఉండాలి. టీచర్స్.. పిల్లలకు సహృద్బావ వాతావరణంలో విద్యాబుద్దులు నేర్పాలి. ప్రెండ్లీ అన్నారు కదా అని..వారితో కలిసి డ్యాన్సులు వేస్తూ టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాస్‌లు చెయ్యకూడదు.

TikTok Videos:  స్కూల్లో టిక్ టాక్ డ్యాన్స్‌లు.. టీచర్ల సస్పెన్షన్..!

Edited By:

Updated on: Feb 23, 2020 | 4:58 PM

TikTok videos: అవును స్కూల్లో ప్రెండ్లీ వాతావరణం ఉండాలి. టీచర్స్.. పిల్లలకు సహృద్బావ వాతావరణంలో విద్యాబుద్దులు నేర్పాలి. ప్రెండ్లీ అన్నారు కదా అని..వారితో కలిసి డ్యాన్సులు వేస్తూ టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాస్‌లు చెయ్యకూడదు. ఇప్పుడు అటువంటి ఓవర్ యాక్షనే  చేసి బుక్కయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం గురుకుల పాఠశాల టీచర్లు. స్కూల్‌ని ఏకంగా టిక్ టాక్ సెంటర్‌గా మార్చిన వైనంపై..ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి..వేటు వేశారు. ముఖ్యంగా ముగ్గురు కాంట్రాక్ట్ టీచర్లు…విద్యార్థినులతో మూవీస్‌లోని డైలాగ్స్ చెప్పించడం, విద్యార్థులతో చపాతీలు చేయించడం వంటి విపరీత చర్యలు.. గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బుర్హాన్ దృష్టికి వెళ్లాయి.  దీనిపై ఆయన ఇప్పటికే విచారణ ప్రారంభించారు. మరోవైపు కలెక్టర్ ఎంవీ రెడ్డి కూడా..సదరు టీచర్స్‌పై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.