Amaravati News: జీవో 107పై మడతపేచీ.. టీడీపీ నెక్స్ట్ ప్లాన్ ఇదే

అమరావతి రాజధాని పరిధిలో పేదలకు ఇవ్వతలపెట్టిన ఫ్లాట్లపైనా, అందుకోసం జారీ చేసిన జీవో నెంబర్ 107పైనా తెలుగుదేశం పార్టీ భారీ ప్రచారానికి సిద్దమవుతోంది. ఇందుకోసం మూడురోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్‌ని చంద్రబాబు ఖరారు చేశారు.

Amaravati News: జీవో 107పై మడతపేచీ.. టీడీపీ నెక్స్ట్ ప్లాన్ ఇదే

Updated on: Feb 26, 2020 | 4:52 PM

TDP to highlight GO 107 in praja chytanya yatra: అమరావతి రాజధాని ఏరియాలో ఇళ్ళస్థలాల కేటాయింపుపై ఏపీవ్యాప్తంగా రాజకీయ రగడకు రంగం సిద్దమవుతోంది. రేపట్నించి మూడు రోజుల పాటు ఈ అంశంపై ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు తాజా పరిస్థితిని వివరించాలని తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్ణయించింది.

మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. రాజధాని ప్రాంతంలో కృష్ణ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 107పై టీడీపీ ముఖ్యనేతల భేటీలో చంద్రబాబు చర్చించారు. రాజధాని ప్రాంతంలో పొరుగు జిల్లాల వారికి స్థలాలు ఇవ్వజూపడం అమరావతిని దెబ్బ తీసేందుకనని టీడీపీ నేతలు అభిప్రాయాలు వ్యక్తి చేశారు.

ఇదీ చదవండి: ట్రంప్ డిన్నర్‌కు జగన్‌ని ఎందుకుపిలవలేదో చెప్పేసిన బొత్స

సిద్ధంగా ఉన్న పేదల గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడు స్థలాల అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదికి తెచ్చిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ చర్య సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేరే వర్గాలకు ఇవ్వజూపడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని, రాజధానిని కదిలించలేని పరిస్థితి వున్నందునే అమరావతి భూముల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

చంద్రబాబు సారథ్యంలో జరిగిన టీడీపీ కీలక సమావేశం వివరాలను, నిర్ణయాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమరావతిని అల్లరి చేస్తోందని రవీంద్ర అన్నారు. ఫిబ్రవరి 27 నుంచి 3 రోజుల పాటు అమరావతిపై ప్రభుత్వ విధానాలను ప్రజా చైతన్యయాత్ర ద్వారా జనంలోకి తీసుకెళతామని ఆయన తెలిపారు. సాఫీగా జరుగుతున్న పరిపాలనను ముఖ్యమంత్రి జగన్ అయోమయంలోకి నెట్టారని, అందరి ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా చంద్రబాబు గతంలో నిర్ణయించారని చెప్పుకొచ్చారాయన.

ఇదీ చదవండి: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని జగన్ చెప్పారని, ప్రస్తుతం మాట మార్చారని అంటున్న రవీంద్ర, అస్తవ్యస్తమైన వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులు వెనక్కుపోతున్నాయని ఆరోపించారు. అమరావతిపై వైసీపీ మంత్రులు విష ప్రచారం చేశారని, అదానీ, లూలు వంటి సంస్థలను వెళ్లగొట్టి విశాఖపై ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారని రవీంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు త్వరలో సతీష్‌రెడ్డి షాక్