వేమన శతకం రీమిక్స్ చేసి కొట్టిన బుద్దా వెంకన్న

|

Sep 13, 2020 | 6:56 PM

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ సర్కారుపై వేమన శతకం అందుకున్నారు. 'దోపిడీనందు వైఎస్ జగన్ దోపిడీ, విజయసాయిరెడ్డి గారడీ వేరయా! అంటూ ఆరోపణల పద్యం పఠించారు. 'ఆర్టీసీ ఛార్జీలు పెంచాం ప్రయాణికుడి పై భారం పడదంటావ్..

వేమన శతకం రీమిక్స్ చేసి కొట్టిన బుద్దా వెంకన్న
Follow us on

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ సర్కారుపై వేమన శతకం అందుకున్నారు. ‘దోపిడీనందు వైఎస్ జగన్ దోపిడీ, విజయసాయిరెడ్డి గారడీ వేరయా! అంటూ ఆరోపణల పద్యం పఠించారు. ‘ఆర్టీసీ ఛార్జీలు పెంచాం ప్రయాణికుడి పై భారం పడదంటావ్, ఇసుక ధర పెంచాం ఇల్లు కట్టుకునే వాడిపై భారం పడదంటావ్, న్యాచురల్ గ్యాస్ ధర పెంచాం భారం ప్రజల పై ఉండదంటావ్, మీటర్లు పెడుతున్నాం రైతు పై మోత లేదంటావ్, విద్యుత్ ఛార్జీలు పెంచి షాక్ కొట్టలేదుగా అంటావ్, మద్యం ధరలు పెంచాం మత్తు ఎక్కదు అంటావ్, మరి పెంచిన పన్నంతా ఇడుపులపాయ నేల మాలిగల్లోంచి తీసి కడుతున్నారా’? అంటూ సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ లపై వేసిన సెటైరికల్ కామెంట్లకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా కౌంటరివ్వడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే.