అప్పుడే నేమ్ ప్లేటా? జగన్ ‘సీఎం’ పిచ్చి పీక్స్‌కి- దేవినేని ఉమ

అమరావతి: ఈవీఎంలపై చర్చించేందుకు ఎన్నికల కమీషన్ భయపడుతుందని..అందుకే చర్చించకుండా తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతుందని ఏపీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చేసిన పోరాటం ఇతర పార్టీలను మేలుకొల్పిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీనే విజయం సాధిస్తుందన్నారు.   31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డిలాంటి నేరగాళ్లు ఫిర్యాదు చేస్తే ఎలా చర్యలు ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను […]

అప్పుడే నేమ్ ప్లేటా? జగన్ 'సీఎం' పిచ్చి పీక్స్‌కి- దేవినేని ఉమ
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 15, 2019 | 12:37 PM

అమరావతి: ఈవీఎంలపై చర్చించేందుకు ఎన్నికల కమీషన్ భయపడుతుందని..అందుకే చర్చించకుండా తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతుందని ఏపీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చేసిన పోరాటం ఇతర పార్టీలను మేలుకొల్పిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీనే విజయం సాధిస్తుందన్నారు.   31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డిలాంటి నేరగాళ్లు ఫిర్యాదు చేస్తే ఎలా చర్యలు ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు వద్దంటున్నారని, ఈవీఎంలు ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపి అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని ”సీఎం” భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. పోలింగ్‌ని ఏ విధంగా ఆలస్యం చేయొచ్చో ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ చేసి చూపిందని దుయ్యబట్టారు. ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించే కుట్ర ఈసీ పన్నిందని ఆరోపించారు. అయినా ప్రజలు..ముఖ్యంగా మహిళల పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని తెలిపారు.