చిన్నారి అత్యాచారం.. నారా లోకేష్ ఆగ్రహావేశం

|

Oct 09, 2020 | 2:50 PM

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ వరుస ట్వీట్లతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన దిశా చట్టం, పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించిన లోకేష్.. అచ్చెన్నాయుడును కావాలనే కక్షపూరితంగా ఇరిగించారని.. అందుకు సాక్ష్యం ఇదేనంటూ ‘టీవీ9 బిగ్ న్యూస్.. బిగ్ డిబేట్’ వార్తా క్లిప్ ను ఉంచి విమర్శలు గుప్పించారు. ‘దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని […]

చిన్నారి అత్యాచారం.. నారా లోకేష్ ఆగ్రహావేశం
Follow us on

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ వరుస ట్వీట్లతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన దిశా చట్టం, పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించిన లోకేష్.. అచ్చెన్నాయుడును కావాలనే కక్షపూరితంగా ఇరిగించారని.. అందుకు సాక్ష్యం ఇదేనంటూ ‘టీవీ9 బిగ్ న్యూస్.. బిగ్ డిబేట్’ వార్తా క్లిప్ ను ఉంచి విమర్శలు గుప్పించారు. ‘దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం. చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్ధమవుతుంది.’ అంటూ బాలిక అత్యాచార ఘటనను ప్రస్తావించారు.

మరో ట్వీట్ లో అచ్చెన్నాయుడుపై అక్రమ కేసంటూ సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నానంటూ టీవీ9 వీడియో క్లిప్స్ ఉంచారు. ‘ఈఎస్ఐ స్కాంలో నిజం చెప్పులు వేసుకునేలోపు.. వైఎస్ జగన్ గారి అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా అచ్చెన్నాయుడు గారిని కేసులో ఇరికించి రాక్షస ఆనందం పొందారు. కానీ చివరికి సత్యమే గెలిచింది. స్వయంగా వైకాపా ప్రభుత్వమే అచ్చెన్నాయుడు గారిని కేసులో ఇరికించాం అని అంగీకరించింది.’ అంటూ లోకేష్ నాలుగు వరుస ట్వీట్లలో ఆరోపణలు సంధించారు.