రేపు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించనున్నారు.

రేపు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ..
Ravi Kiran

|

Jun 17, 2020 | 8:14 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించనున్నారు. వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల(రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య 4మూల స్థంభాలను కూలదోసే దుశ్చర్యలు, టీడీపీ నాయకులు- కార్యకర్తలపై తప్పుడు కేసులు-అరెస్ట్‌లు చేయడం వంటి అంశాలపై చంద్రబాబు గవర్నర్‌కు వివరించనున్నారు.

అలాగే దళితులపై దాడులు-దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు. 4రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు, వైసీపీ అప్రజాస్వామిక చర్యలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, మైనారిటి వర్గాలకు- మహిళలకు కొరవడిన భద్రత, వైసీపీ నాయకుల అవినీతి కుంభకోణాలపై కూడా చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu