విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది

ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకుని చంద్రబాబు, లోకేష్ లను చెడుగుడాడే వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. 'తెలుగు మాట్లాడడమే సరిగారాదు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:59 pm, Thu, 3 September 20
విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది

ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకుని చంద్రబాబు, లోకేష్ లను చెడుగుడాడే వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ‘తెలుగు మాట్లాడడమే సరిగారాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ..’ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి వ్యంగ్యభరిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కొన్ని గంటల్లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివేకా చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న నువ్వు తెలుగు కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ విజయసాయిపై ధ్వజమెత్తారు. గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు అంటూ సెటైర్ వేశారు. పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం మీది. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి, నీకు దళిత జాతి గుండు కొట్టడం ఖాయం అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు అయ్యన్నపాత్రుడు.