టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అరెస్ట్..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే  ఆలపాటి రాజేంద్రప్రసాద్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నేడు(జనవరి9) రైతులతో కలిసి  గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి పాదయాత్రగా బయల్దేరగా, నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరోవైపు ఆలపాటి పాదయాత్ర నేపథ్యంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు […]

టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అరెస్ట్..!

Updated on: Jan 09, 2020 | 11:09 AM

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే  ఆలపాటి రాజేంద్రప్రసాద్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నేడు(జనవరి9) రైతులతో కలిసి  గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి పాదయాత్రగా బయల్దేరగా, నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరోవైపు ఆలపాటి పాదయాత్ర నేపథ్యంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.