AP Local War: “టీవీ ఆన్ చేస్తే సీఎం ఫోటో వస్తుంది”.. చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పెరుగుతుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నేతలు అనేక పాట్లు పడుతున్నారు. మరోవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ

AP Local War: టీవీ ఆన్ చేస్తే సీఎం ఫోటో వస్తుంది.. చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

Updated on: Feb 06, 2021 | 1:07 PM

AP Local Body Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పెరుగుతుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నేతలు అనేక పాట్లు పడుతున్నారు. మరోవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది. ఏపీ ఫైబర్ నెట్‌పై టీడీపీ ఫిర్యాదు చేసింది. టీవీ ఆన్ చేయగానే ముఖ్యమంత్రి జగన్ ఫోటో వస్తుంది అని ఈసి దృష్టికి తీసుకువెళ్లింది.

రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్ లు ఉన్నాయని లేఖలో టీడీపీ పేర్కొంది.  పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం ఫోటో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఫైబర్ నెట్‌లో ముఖ్యమంత్రి జగన్ ఫోటో వచ్చేలా కావాలనే ఏర్పాటు చేశారని  ఎన్నికల్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే ఫైబర్ నెట్‌లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ కోరింది.

 

Also Read:

Ap Local Body Elections: పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్‌.. “సీఎం జగన్ పథకాల చూసే బరిలోకి”

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ తాయిలాల పరంపర.. భీమవరం మండలంలో భారీగా ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం