Signing of Blank Documents: వ్యాపారిని బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు..
Signing of Blank Documents: తీసుకున్న అప్పు చెల్లించని కారణంగా కొంతమంది కలిసి ఓ వ్యాపారి చేత ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. హైదరాబాద్‌లో
Signing of Blank Documents: తీసుకున్న అప్పు చెల్లించని కారణంగా కొంతమంది కలిసి ఓ వ్యాపారి చేత ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. హైదరాబాద్‌లో జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్‌లోని పద్మశ్రీ టవర్స్‌లో నివాసం ఉంటున్న ఆర్.సుధీర్ గతంలో ఆర్‌ఎస్‌ఆర్ జువెలర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. 2008లో వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీధర్, విజయ్, విష్ణు అనే వ్యక్తుల నుంచి పలుమార్లు డైలీ ఫైనాన్స్ తీసుకున్నాడు. సుమారు నాలుగేళ్లపాటు వీరిమధ్య లావాదేవీలు జరిగాయి. కాగా 2012లో వ్యాపారం దెబ్బతినడంతో సుధీర్ రూ.2 కోట్ల అప్పు పడ్డాడు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తానంటూ 2013లో సుధీర్ అంగీకరించాడు.అయితే అనుకున్న విధంగా డబ్బులు చెల్లించలేదు.
ఈ క్రమంలో విష్ణు అతడి భార్య.. సుధీర్‌కు ఫోన్‌చేసి తనకు రావాల్సిన డబ్బుతో పాటు ఏడేళ్ల వడ్డీని కలిపి రూ.1.8 కోట్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల 2న సుధీర్‌కు ఫోన్ చేసి బంజారాహిల్స్‌లోని అపార్ట్‌మెంట్స్‌కు రావాలని చెప్పగా అక్కడికి వెళ్లాడు. అక్కడ విష్ణు, విజయ్, శ్రీధర్, షకీర్‌తో సహా 13 మంది ఉన్నారు. వెంటనే డబ్బులు ఇవ్వకపోతే అంతుచూస్తామని హెచ్చరించడంతో పాటు బలవంతంగా ఆరు ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు ఫైల్ చేశారు.
IRCTC Launches: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ