Accident Cctv Video: ఇంత నిర్లక్ష్యమా..? నో హెల్మెట్.. నో నెంబర్ ప్లేట్.. ట్రిపుల్ రైడింగ్.. యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

పోలీసులు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు వినడం లేదని ఓ రేంజ్‌లో ఫైన్లు వేస్తున్నారు. మితిమీరితే జైలు శిక్షలు కూడా పడేలా చూస్తున్నారు.

Accident Cctv Video: ఇంత నిర్లక్ష్యమా..? నో హెల్మెట్.. నో నెంబర్ ప్లేట్.. ట్రిపుల్ రైడింగ్.. యాక్సిడెంట్ షాకింగ్ వీడియో
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 06, 2021 | 2:06 PM

Accident Cctv Video footage:  పోలీసులు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు వినడం లేదని ఓ రేంజ్‌లో ఫైన్లు వేస్తున్నారు. మితిమీరితే జైలు శిక్షలు కూడా పడేలా చూస్తున్నారు. అయినా కానీ కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా  హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ జరిగిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఓ బాలిక ప్రాణపాయస్థితిలోకి వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. బల్కంపేటలోని ఎల్లమ్మ టెంపుల్ వెనుక ఉన్న రోడ్డులో శుక్రవారం ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్తుంది. ఈ క్రమంలోనే బాలిక తల్లి వెనకాల వస్తుండగా రూల్స్‌కు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్‌ చేస్తున్న యువకులు బైక్‌తో ఓ చిన్నారిని వేగంగా ఢీకొన్నారు. ఈ ఘటనతో బాలిక తీవ్రంగా గాయపడగా.. కళ్లారా చూసిన తల్లి దిగ్భ్రాంతికి గురైంది. గాయపడిన బాలిక పరిస్థితి ఏంటో కూడా చూడకుండా సదరు యువకులు బైక్‌పై పారిపోయారు. ఈ షాకింగ్ ఘటన దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే సీసీటీవీ పుటేజీలో రికార్డయిన వీడియో నుంచి ఆ ముగ్గురు ఫోటోలు సేకరించి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్