తమిళనాడులో లక్షా 70 వేలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆదివారం 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,979 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో లక్షా 70 వేలు దాటిన కరోనా కేసులు
Telangana Coronavirus

Updated on: Jul 19, 2020 | 7:55 PM

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆదివారం 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,979 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య లక్ష 70 వేల మార్కు దాటేసి 1,70,693కు చేరుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 50,294 యాక్టివ్‌గా ఉన్నట్టు పేర్కొంది. ఇందులో కొందరు ప్రభుత్వ ఆస్పత్రులు, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులు, ఇంకొందరు ప్రత్యేక క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

ఇవాళ 78 మంది కరోనా బారినపడి మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 2,481కి పెరిగింది. తాజాగా, 4,059 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,17,915కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మొత్తంగా 52,993 మంది శాంపిళ్లను పరీక్షించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 19 లక్షలు దాటింది. దీంతో కంటెయిన్మెంట్ ఏరియాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలుచేస్తున్నారు పోలీసులు.