తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. స్వరరాజా ఇళయరాజా కలిసిన కిషన్ రెడ్డి

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. స్వరరాజా ఇళయరాజా కలిసిన కిషన్ రెడ్డి
Kishan Reddy Meets Ilaiyaraaja

Updated on: Mar 29, 2021 | 8:04 PM

Kishan reddy meets ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నైలోని ఆయన నివాసాని వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Union Minister Kishan Reddy Meets Musician Ilaiyaraaja

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ.. అనేక చర్యలు తీసుకుంటుంది. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పయించింది. తమిళనాడు ఎన్నికల ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి ఇప్పటికే అక్కడ స్థానిక పరిస్థితులపై దృష్టి సారించారు.. ప్రముఖులకు గాలం వేస్తున్నారు. ఇటీవల సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అర్జున్‌ను బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలని కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తాజాగా ఇళయరాజాతో కిషన్ భేటీ కావడంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.
Read Also..కరోనా ఎఫెక్ట్ః తిరుపతి వెళ్లేవారికి అలర్ట్.. మరోసారి ఆంక్షలు విధించిన అధికారులు.. వారికి మాత్రమే అనుమతి!