తమిళనాడులో రికార్డుస్థాయిలో 3,949 మందికి కరోనా

|

Jun 29, 2020 | 7:43 PM

తమిళనాడులో ఇవాళ కొత్తగా 3,949 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఒక్కరోజే 62 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం 1,141 మంది ప్రాణాలు వదిలారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో రికార్డుస్థాయిలో 3,949 మందికి కరోనా
Follow us on

కరోనా విజృంభణతో తమిళనాడు నలిగిపోతోంది. రికార్టుస్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుందడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే హాట్ స్పాట్ గా భావించిన ప్రాంతాలను లాక్ డౌన్ విధించినప్పటికీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు మూడోస్థానంలో కొనసాగుతోంది.
తమిళనాడులో ఇవాళ కొత్తగా 3,949 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఒక్కరోజే 62 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం 1,141 మంది ప్రాణాలు వదిలారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మరో 2,212 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 47,749 డిశ్చార్జి అయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 37,331 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోనే వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 2,167 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.