AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేత్రదానం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి

అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. నేత్రదానం చేయడంలో నా కూడా భాగస్వామ్యం అవుతున్నానంటూ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్‌ సందర్భంగా పళనిస్వామి తన నేత్రాలను దానం చేశారు.

నేత్రదానం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
Balaraju Goud
|

Updated on: Sep 08, 2020 | 1:28 PM

Share

అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. నేత్రదానం చేయడంలో నా కూడా భాగస్వామ్యం అవుతున్నానంటూ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్‌ సందర్భంగా పళనిస్వామి తన నేత్రాలను దానం చేశారు. అనంతరం నేత్రదానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోర్టల్‌ను ఈ సందర్భంగా ప్రారంభించారు.

అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని పిలుపునిచ్చారు. కళ్లు లేని వారికి వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పళనిస్వామికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్‌వీ చంద్రకుమార్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత అని, తన నేత్రాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తన దేశాన్ని అంధత్వరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆ సర్టిఫికేట్ పేర్కొంది. దేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నేషనల్‌ ఐ డొనేషన్‌ను ఫోర్ట్‌నైట్‌గా పాటిస్తారు.

Follow Us
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?