టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ షురూ.. వేదికగా భారత్.. మోతేరా స్టేడియంలో ఫైనల్.!
2021 టీ20 వరల్డ్‌కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కౌంట్ డౌన్ షురూ చేసింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్...
T20 World Cup 2021: 2021 టీ20 వరల్డ్‌కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కౌంట్ డౌన్ షురూ చేసింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీని తాజాగా ఐసీసీ ఆవిష్కరించింది. వాస్తవానికి 2021 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. అయితే దాన్ని కరోనా కారణంగా సెప్టెంబర్-నవంబర్ మధ్య భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతిస్తారా.? లేదా.? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు రాబోయే రోజుల్లో ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గకపోతే బయోబబుల్ బుడగలోనే యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తోంది.
దీనిపై నవంబర్ 18, 19 తేదీల్లో జరిగే బోర్డు మీటింగ్‌లో ఐసీసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు 2021 టీ20 ప్రపంచకప్ ఇండియాలో జరిగితే మాత్రం ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని అతి పెద్ద మోతేరా స్టేడియంలో బీసీసీఐ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం పదహారు టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఒమన్, పుపువా న్యూగినియా జట్లు ఉన్నాయి.
Also Read:
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..