సింథటిక్ పాలతో దందా.. హైటెక్ ముఠా గుట్టురట్టు

| Edited By:

Jul 21, 2019 | 1:53 PM

సింథటిక్ పాలు, వాటి పదార్థాలను తయారు చేస్తూ.. అమాయక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఓ హైటెక్ ముఠా గుట్టురట్టయ్యింది. మధ్యప్రదేశ్‌ పోలీసులు వీరి బాగోతాన్ని బట్టబయలు చేసి.. దీనికి చెక్ పెట్టారు. రాష్ట్రంలోని మొరీనా జిల్లాలోని అంబా, బింద్, లహర్ ప్రాంతాల్లోని పలు పరిశ్రమల్లో ఈ సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. అయితే పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది.. ఆ పరిశ్రమలపై దాడులు చేశారు. సంఘటనా స్థలంలో పలు రసాయనాలు, పదివేల లీటర్ల […]

సింథటిక్ పాలతో దందా.. హైటెక్ ముఠా గుట్టురట్టు
Follow us on

సింథటిక్ పాలు, వాటి పదార్థాలను తయారు చేస్తూ.. అమాయక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఓ హైటెక్ ముఠా గుట్టురట్టయ్యింది. మధ్యప్రదేశ్‌ పోలీసులు వీరి బాగోతాన్ని బట్టబయలు చేసి.. దీనికి చెక్ పెట్టారు. రాష్ట్రంలోని మొరీనా జిల్లాలోని అంబా, బింద్, లహర్ ప్రాంతాల్లోని పలు పరిశ్రమల్లో ఈ సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. అయితే పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది.. ఆ పరిశ్రమలపై దాడులు చేశారు. సంఘటనా స్థలంలో పలు రసాయనాలు, పదివేల లీటర్ల సింథటిక్ పాలు, 500 కేజీల పాలపొడి, 200 కేజీల సింథటిక్ వెన్నను స్వాధీనం చేసుకున్నారు. 20 ట్యాంకర్లు, 11 పాల వ్యాన్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 62 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు వీరు సింథటిక్ పాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.