ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధితో ప్రజలు బెంబేలెత్తుతోంటే.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మాత్రం రివర్స్‌గా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కానీ.. రోగుల పట్ల మాత్రం గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు స్వైన్ ఫ్లూ భయం వెంటాడుతున్నా వైద్యులు, సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. తాజాగా వరంగల్ భూపాల పల్లికి చెందిన ఓ నిండు గర్భిణి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. అర్థరాత్రి సమయంలో ఆమెకు చికిత్స చేసేవారే లేకపోయారు. అటు నర్సులు సైతం ఆమెను పట్టించుకోలేదు. ఈ ఉదంతం కాస్తా.. ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో.. విచారణ జరిపారు. షిఫ్ట్‌లో నలుగురు డాక్టార్లు ఉన్నా.. ఒక్కరు కూడా ఐసీయూలో ఉన్న గర్భిణిని పట్టించుకోలేదని తేలింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. స్వైన్ ఫ్లూ ఉన్న గర్బిణికి వైద్యం అందించంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.