ఊపిరి తీసుకోకుండా కంటిన్యూస్‌గా మాట్లాడటమే కష్టం. అలాంటిది పాట పాడితే..వారి అద్భుతమైన ప్రతిభకు చప్పట్లతో సత్కారం చేయాల్సిందే. కేవలం కొందరు సింగర్స్‌కి మాత్రమే ఈ అరుదైన టాలెంట్ ఉంటుంది. శంకర్ మహాదేవన్ పాడిన ‘మహాప్రాణ దీపం’, బాలు పాడిన ‘ఓ పాప లాలీ’ లాంటి పాటలు ఆ కోవకే చెందుతాయి. అలాంటి లెజెండ్స్ చేసిన బ్రేత్ లెస్ ఫీట్‌ను ఇప్పుడో యంగ్ సింగర్ చేసి చూపించి ఔరా అనిపించారు.
‘సీతాయణం’ అనే సినిమా కోసం బ్రీత్ లెస్ సాంగ్ పాడారు సింగర్ శ్వేతా మోహన్. అయితే పాటంతా బ్రేత్ లెస్ కాదు. కేవలం చరణం వరకు ఊపిరి తీసుకుకోకుండా పాడారు శ్వేత. చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చిన ఈ సాంగ్‌ను పద్మనాభ్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఫస్ట్ టైం ఓ లేడీ సింగర్ బ్రేత్ లెస్ అంటెప్ట్ చేయటంతో గ్రేట్ అంటున్నారు సాంగ్ విన్న ఆడియన్స్. అంతేకాదు ఈ ఛాన్స్ తనకు రావటం ఫుల్ హ్యాపీ అన్నారు సింగర్ శ్వేత. ‘సీతాయనం’లో కన్నడ నటుడు అక్షిత్ శివకుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాకర్ అరిపాక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు
కేంద్రం కీలక నిర్ణయం, స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే