వెండితెర ‘ధోని’.. 50 కలలు.. ట్వీట్ వైరల్..

|

Jun 15, 2020 | 3:15 PM

డబ్బు, ఫేమ్, అత్యున్నత స్థానం.. ఇలా అన్ని సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. టీవీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అతి కొద్దికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌డ్‌ హీరోగా ఎదిగాడు. జీవితంలో ఎన్నో సాధించాలనుకున్న సుశాంత్.. మానసిక ఒత్తిడికి తలొగ్గి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడి అందర్నీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుశాంత్‌కు సంబంధించిన పలు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఇప్పుడు అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి. జీవితంలో తాను […]

వెండితెర ధోని.. 50 కలలు.. ట్వీట్ వైరల్..
Follow us on

డబ్బు, ఫేమ్, అత్యున్నత స్థానం.. ఇలా అన్ని సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. టీవీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అతి కొద్దికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌డ్‌ హీరోగా ఎదిగాడు. జీవితంలో ఎన్నో సాధించాలనుకున్న సుశాంత్.. మానసిక ఒత్తిడికి తలొగ్గి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడి అందర్నీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో సుశాంత్‌కు సంబంధించిన పలు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఇప్పుడు అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి. జీవితంలో తాను సాధించాలనుకున్న కలలను ఓ పేపర్ మీద రాసి ‘మై 50 డ్రీమ్స్.. అండ్ కౌంటింగ్’ అని పేర్కొంటూ అభిమానులకు పంచుకున్నాడు. ఇప్పటికే వాటిల్లో కొన్ని అతడు పూర్తి చేశాడు. వాటిల్లో కొన్ని…

  • విమానం నడపడం నేర్చుకోవాలి
  • ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడాలి
  • మోర్స్ కోడ్ నేర్చుకోవాలి
  • పిల్లలకు స్పేస్, పాలపుంత గురించి తెలుసుకోవడంలో సహాయం చేయాలి
  • నాలుగు క్లాప్ పుషప్స్ చేయాలి
  • బ్లూ హోల్‌లోకి డైవ్ చేయాలి
  • 1000 మొక్కలు నాటాలి
  • ఢిల్లీలోని నా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఒక సాయంత్రం గడపాలి
  • ఇస్రో, నాసాలో జరిగే వర్క్ షాపులకు 100 మంది పిల్లలను పంపించాలి
  • కైలాష్‌లో మెడిటేషన్ చేయాలి
  • ఒక బుక్ రాయాలి
  • ఆరు నెలల్లో సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలి
  • నాసా వర్క్ షాప్ మరోసారి అటెండ్ అవ్వాలి
  • అంధులకు కోడింగ్ నేర్పించాలి
  • వారం పాటు అడవిలో ఉండాలి
  • డిస్నీ ల్యాండ్ చుట్టి రావాలి
  • ఉచిత విద్య కోసం కృషి చేయాలి
  • మహిళలకు ఆత్మ రక్షణలో శిక్షణ ఇవ్వాలి
  • చిన్నారులకు డ్యాన్స్ నేర్పించాలి
  • లంబోర్‌ఘిని కార్ కొనుగోలు చేయాలి
  • స్వామి వివేకానంద జీవితంపై డాక్యుమెంటరీ తెరకెక్కించాలి.