AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భ‌లే..భ‌లే.. సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన గుడ్లతో బాతు పిల్లలు..

కరోనావైర‌స్ వ‌చ్చి ప్రపంచంలోని జ‌నాభా మొత్తాన్ని ఇంట్లో లాక్ చేసేసింది. ఈ వైర‌స్ ఎఫెక్ట్ తో ఇప్ప‌టికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోగా..కొంద‌రు ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

భ‌లే..భ‌లే.. సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన గుడ్లతో బాతు పిల్లలు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 3:30 PM

Share

కరోనావైర‌స్ వ‌చ్చి ప్రపంచంలోని జ‌నాభా మొత్తాన్ని ఇంట్లో లాక్ చేసేసింది. ఈ వైర‌స్ ఎఫెక్ట్ తో ఇప్ప‌టికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోగా..కొంద‌రు ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన 29 ఏండ్ల చార్లీ లెల్లో కూడా లాక్ డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆమె పని చేస్తున్న కంపెనీ సెలవులు తీసుకోమ‌ని చెప్పింది. దీంతో ఇంటి వద్ద ఖాళీగా ఉండేబ‌దులు ఏదో ఒక కొత్త ప్రయోగం చేయాలని భావించింది లెల్లో. సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన గుడ్లను పొదిగించి గద్ద పిల్లలు వృద్ధిచేసిన‌ విషయాన్ని ఫేస్‌బుక్‌ వీడియో ద్వారా తెలుసుకుంది. దీంతో తాను కూడా ఆ ప్ర‌యోగం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

అనుకున్న‌దే త‌డ‌వుగా సూపర్‌ మార్కెట్‌కు వెళ్లన‌ లెల్లో మూడు బాతు గుడ్లను తెచ్చింది. వాటిని ఇంక్యుబేటర్‌లో ఉంచి రోజూ పరిశీలించసాగింది. అయితే వారం రోజుల వ‌ర‌కు వాటిలో ఎటువంటి మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో నిరాశ చెందింది. ఆ త‌ర్వాత గుడ్ల లోప‌ల మార్పులు జ‌రుగుతున్న‌ట్లు అనిపించ‌డంతో ఆమెకు జోష్ వ‌చ్చింది. అలా నెల రోజుల గ‌డిచిన‌ తర్వాత ఆ గుడ్ల నుంచి మూడు బుజ్జి బాతు పిల్లలు బయటకు వచ్చాయి. వాటికి బీప్‌, పీప్‌, మీప్‌ అని పేరుపెట్టింది లెల్లో. ఎప్పుడూ ఉద్యోగంతో బిజీగా ఉండే తాను కోవిడ్-19 నేపథ్యంలో ఇంటివ‌ద్దే ఉండ‌టంతో ఇలా చేయగలిగినట్లు తెలిపింది. అవి పెద్దగా అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె తెలిపింది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి