
ఉగ్రవాదులంతా ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మాజీ ఉగ్రవాది ఉనాఫ్ మాలిక్ కోరాడు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో అతడు పోటీచేశాడు. రాజౌరీ జిల్లాలోని దర్హల్ మల్కాన్ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు. గతంలో ఉగ్రవాదిగా పనిచేసిన ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు. ‘తాను ఏడేండ్ల పాటు ఓ ఉగ్రవాద సంస్థలో డివిజనల్ కమాండర్‌గా పనిచేశానని తెలిపారు. తనలాగే ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని కోరారు.
ఎనిమిది విడుతలుగా జరిగిన డీడీసీ ఎన్నికలు ముగిశాయి. ఆఖరి విడుత పోలింగ్‌లో జమ్మూ డివిజన్‌లో 77.1 శాతం పోలింగ్, కాశ్మీర్ డివిజన్‌లో 29.91 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 51 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లను డిసెంబర్ 22న లెక్కించనున్నారు.