కోటా పాలసీ పై సుప్రీంకోర్టు తీర్పు, మెరిట్ కే ప్రాధాన్యం, మత ప్రాతిపదిక సబబు కాదన్నన్యాయస్థానం

| Edited By: Anil kumar poka

Dec 19, 2020 | 2:13 PM

మత ప్రాతిపదికపై రిజర్వేషన్ అన్న విధానం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా లేదా రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తున్నంత మాత్రాన..ప్రతిభ (మెరిట్) గల  అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను తొసిపుచ్చడం..

కోటా పాలసీ పై సుప్రీంకోర్టు తీర్పు, మెరిట్ కే ప్రాధాన్యం, మత ప్రాతిపదిక సబబు కాదన్నన్యాయస్థానం
Follow us on

మత ప్రాతిపదికపై రిజర్వేషన్ అన్న విధానం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా లేదా రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తున్నంత మాత్రాన..ప్రతిభ (మెరిట్) గల  అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను తొసిపుచ్చడం సబబు కాదని రూలింగ్ ఇచ్చింది. వారు రిజర్వ్డ్ కేటగిరీలకు చెందినవారన్న కారణంగా ఈ అవకాశాలను తిరస్కరించరాదని యూపీ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది. జస్టిస్ ఉదయ్ లలిత్ ఆధ్వర్యాన గల బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అనుమతించదగిన కోటా ప్రయోజనాల ప్రకారం,ఆయా సంస్థల్లో సీట్లను భర్తీ చేసే ఏ విధానమైనా మెరిట్ పై దృష్టి పెట్టేలా ఉండాలని, అంటే ప్రతిభగల అభ్యర్థులు ఏ కేట గిరీలు, లేదా ఏ కులానికి చెందినవారైనా సరే వారి మెరిట్ కే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ బెంచ్ సూచించింది. ఓపెన్ కేటగిరీలో కాంటెస్ట్ అన్నది పూర్తిగా మెరిట్ పై జరగాలని అభిప్రాయపడింది.

యూపీలో మహిళా కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి ప్రత్యేక తరగతుల కింద ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కొంతమంది అభ్యర్థులు సవాల్ చేశారు .జనరల్ కేటగిరీకి కటాఫ్ కి మించి మార్కులు సాధించిన పురుష అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఈ పాలసీ నిర్దేశిస్తోందని, అయితే అదే నిబంధనను మహిళా అభ్యర్థులకు వర్తింపజేయలేమని ఇది నిర్దేశిస్తోందని వారు పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు లేదా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతిభగల అభ్యర్థులు జనరల్ లేదా ఓపెన్ కేటగిరీకి మైగ్రేట్ కావచ్చు.. ఇదే అంశంపై పలు హైకోర్టులు రూలింగులు ఇచ్చాయి.  స్వాతంత్య్ర సమర యోధులు, మాజీ సైనికోద్యోగుల కుటుంబాల అభ్యర్థులకు ఉద్దేశించిన సీట్లను (కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ) వారు ఇతరులకు వదులుకోవచ్చు.. కాగా ఈ కేసులో 21 మంది మహిళా అభ్యర్థులకు అనుకూలంగా కోర్టు తీర్పునిస్తూ.. వారు జనరల్ కేటగిరీ-ఫిమేల్ కింద ఎంపికైన చివరి అభ్యర్థికన్నా ఎక్కువ మార్కులు సాధించినందున వారిని పోలీసుకానిస్టేబుల్స్ గా నియమించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.