విరాట్ కోహ్లీకి సూపర్ స్టార్ మహేష్, రకుల్ సందేశం

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా అభిమాన క్రికెట‌ర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. నువ్వు మరెన్నో రికార్డులు సృష్టిస్తూ దేశం గ‌ర్వించేలా చేయాలి’ అని మహేశ్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నాడు. ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న కోహ్లీకి దేశవిదేశాలకు చెందిన క్రీడాభిమానులు, పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోయిన్ […]

విరాట్ కోహ్లీకి సూపర్ స్టార్ మహేష్, రకుల్ సందేశం

Updated on: Nov 05, 2020 | 1:22 PM

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా అభిమాన క్రికెట‌ర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. నువ్వు మరెన్నో రికార్డులు సృష్టిస్తూ దేశం గ‌ర్వించేలా చేయాలి’ అని మహేశ్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నాడు. ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న కోహ్లీకి దేశవిదేశాలకు చెందిన క్రీడాభిమానులు, పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోహ్లీకి హ్యాపీ బర్త్ డే చెప్పింది. భారత ప్రముఖ క్రికెటర్లు రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ తదితరులు కోహ్లీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.