నా బయోపిక్ తీసినా.. ఆ సినిమా హిట్ కాదని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమాతో హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. వరుస టూర్స్‌తో బిజి బిజీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోన్న మహేష్.. ఆ తరువాత సినిమా డైరెక్టర్ వంశీతో చేయనున్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకెక్కనుందని వంశీ ఇదివరకే చెప్పారు. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్.. తన పొలిటికల్ ఎంట్రీ, బయోపిక్‌ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదివరకే మహేష్ రాజకీయాల్లోకి రానని తెలిపినా.. ఈ మధ్య కొన్ని వార్తలు జోరుగా వైరల్ అవుతోన్న సందర్భంగా దీని గురించి మహేష్.. మళ్లీ మాట్లాడక తప్పలేదు. ‘మీరు ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు సమాధానంగా.. నేను సీఎం అయితే.. రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని పేర్కొన్నారు. రాజకీయాల గురించి తనకసలు ఏం తెలీదని.. నా దృష్టి అంతా.. కేవలం సినిమాలపైనే’ ఉందని సమాధానమిచ్చారు.
కాగా.. అలాగే మహేష్ బాబు జీవితంపై బయోపిక్ వస్తుందా? అని ప్రశ్నించగా.. ‘తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్ అని.. తనపై బయోపిక్ ఎవరైనా తీసినా ఆ సినిమా హిట్ కాదని’ నవ్వుతూ జవాబిచ్చారు మహేష్.