మనీష్ పాండే, విజయ్ మెరుపులు.. గెలిచిన హైదరాబాద్

|

Oct 22, 2020 | 11:46 PM

హైదరాబాద్ ఘన విజయం సాధించింది. గెలవక తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను...

మనీష్ పాండే, విజయ్ మెరుపులు.. గెలిచిన హైదరాబాద్
Follow us on

Sunrisers Hyderabad Win : హైదరాబాద్ ఘన విజయం సాధించింది. గెలవక తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మనీష్‌ పాండే(83/47 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8సిక్సులు), విజయ్‌ శంకర్‌(52/51 బంతుల్లో 6 బౌండరీలు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో రాజస్థాన్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అంతకుముందు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(4), బెయిర్‌స్టో(10) స్వల్ప స్కోరుకే ఇంటి దారి పెట్టారు. వీరిద్దరూ జోఫ్రాఆర్చర్‌ బౌలింగ్‌లో ఆరంభంలోనే వెనుతిరిగారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్‌, విజయ్‌ చివరి వరకూ క్రీజులో ఉండి జట్టుకు మరిచిపోలేని విజయాన్ని అందించారు. వీరిద్దరూ అజేయంగా 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించింది.

అంతకుముందు తొలత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌(30: 32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్‌(36: 26 బంతుల్లో 3ఫోర్లు,సిక్స్‌) రాణించడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌(20: 12 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌(3/33) తెలివైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.