మరో కారును కొనుగోలు చేసిన సన్నీ లియోన్…

|

Sep 12, 2020 | 3:59 PM

బాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ మరో కొత్త కారు కొనుగోలు చేశారు. కార్లపై తనకున్న మక్కువను మరోసారి నిరూపించుకున్నారు....

మరో కారును కొనుగోలు చేసిన సన్నీ లియోన్...
Follow us on

బాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ మరో కొత్త కారు కొనుగోలు చేశారు. కార్లపై తనకున్న మక్కువను మరోసారి నిరూపించుకున్నారు. అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇట‌లీ కంపెనీ మ‌స‌రాటీ త‌యారు చేసే కార్లంటే ఆమెకు చాలా ఇష్టం అని చాలా ఇంటర్వూల్లో చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన అభిమానులతో ఈ సంగతి పంచుకున్నారు. ఫోటోలతోపాటు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.


ఇదే కంపెనీకి చెందిన కార్లు సన్నీ వద్ద మరో రెండు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అదేకంపెనీలోని మరింత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇటీవ‌లే ఆమె 1.31 కోట్లు ఖ‌ర్చుచేసి తెలుపురంగు గిబ్లి కారుతో ఫోటోలు దిగారు. దాని కంటే ముందు ఆమె వ‌ద్ద క్వాట్రాపోర్ట్‌, గిబ్లీ నిరిసిమో మోడ‌ల్ కార్లు ఉన్నాయి.

లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో లాస్‌ఎంజెల్స్ ఉంటున్నారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. అమెరికాలో ఉన్న త‌న ఇంటి వ‌ద్ద‌కు ఈ కొత్త గిబ్లీ కారు డెలివ‌రీ అయ్యిందని ఆమె తెలిపింది. ఈ గిబ్లి కారు  3.0 లీట‌ర్ ట్విన్ ట‌ర్బో వీ6 ఇంజిన్ తో గంటకు వంద కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 5.5 సెక‌న్ల‌లో అందుకునేంత పిక‌ప్ ఈ కారుకి ఉంటుంది.