తాడికొండ మండలం పొన్నెకల్లులో ఓ భారీ చోరీ జరిగింది. కేసరి అశోక్ రెడ్డి ఇంట్లో మెయిన్ డోర్లు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు, 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి వస్తువులను అపహరించారు. వీటి విలువ సుమారు 70 లక్షల రూపాయలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీం దర్యాప్తు ప్రారంభించాయి.