గుంటూరు నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కుళ్ళిన కోడి కూర, బూజుపట్టిన మటన్, గడ్డకట్టిన మాంసం, కాలం చెల్లిన మసాలాలు బయటపడ్డాయి. దుర్వాసన వెదజల్లుతున్న ఫ్రిజ్లు, అపరిశుభ్రమైన వంటగదులు అధికారులనే ముక్కులు మూసుకునేలా చేశాయి. తాజాదనం కోసం రసాయన రంగులు కలిపి వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు వెల్లడైంది.