Summer Gadgets: కరెంటు పోయినా ఇబ్బంది లేదు.. తక్కువ ధరల్లోనే గ్యాడ్జెట్స్.. ఎన్నో ఉపయోగాలు!
Summer Gadgets: వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో తరచుగా పవర్ కట్స్ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కరెంటు లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఈ గ్యాడ్జెట్స్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Summer Gadgets
Summer Gadgets: వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో తరచుగా పవర్ కట్స్ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కరెంట్ పోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- ఎమర్జెన్సీ బల్బ్: పవర్ కట్ సమయంలో కూడా వెలుతురు ఇవ్వగల బల్బులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఛార్జింగ్ బల్బుతో కొంత పరిష్కారం పొందవచ్చు. సుమారు 1000 లూమెన్స్ లైట్ అవుట్‌పుట్ 4kV సర్జ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల సేఫ్ కరెంట్ పోయినా వెంటనే వెలుగుతుంది. దీని ధర సుమారు రూ.255 వరకు ఉంటుంది.
- 2. Philips T-Beamer ఎమర్జెన్సీ లైట్: ఇది పెద్ద గదులను కూడా సరిపోతుంది. దీనికి 2600mAh బ్యాటరీ ఉంటుంది. ఇది సుమారు 3 గంటల బ్యాకప్ వరకు వస్తుంది. కరెంట్ లేకపోయినా ఇబ్బంది ఉండదు. కరెంటు పోయిన సమయంలో ఈ ఎమర్జెన్సీ లైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.798 వరకు ఉంటుంది.
- 3. Bajaj Pygmy Go పోర్టబుల్ ఫ్యాన్: చిన్నదైనా చాలా ఉపయోగకరం. విద్యుత్ సమస్య ఉన్నప్పుడు ఫ్యాన్ లేక ఉండలేకపోతుంటారు. అలాంటి సమయంలో ఈ పోర్టబుల్ ఫ్యాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పవర్ కట్ సమయంలో కూడా చల్లని గాలిని ఇస్తుంది. ఇది సుమారు 4 గంటల వరకు బ్యాకప్ ఉంటుంది. USB ద్వారా ఛార్జ్ అవుతుంది. అలాగే లైట్ కూడా ఉంటుంది. దీని ధర సుమారు రూ.1,499 వరకు ఉంటుంది.
- 4. Zebronics Buster ఫ్యాన్: ఇది మరింత పవర్‌ఫుల్ పోర్టబుల్ ఫ్యాన్. 13 గంటల వరకు బ్యాకప్ వస్తుంది. దీనికి 4 స్పీడ్ మోడ్‌లు ఉంటాయి. ఇది 3600mAh బ్యాటరీతో వస్తుంది.టేబుల్ లేదా గోడపై పెట్టి కూడా ఉపయోగించవచ్చు. వేసవిలో పవర్ కట్స్ సాధారణం. అలాంటి సమయంలో ఈ గ్యాడ్జెట్లు ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ధరలు కూడా పెద్దగా ఉండకపోవడం సామాన్యులు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్స్ వల్ల చీకటి సమస్య ఉండదు. అలాగే ఛార్జింగ్ ఫ్యాన్‌లతో వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. పని, చదువు అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు. మొత్తానికి తక్కువ ధరలో లభించే ఈ గ్యాడ్జెట్లు వేసవిలో మీకు పెద్ద ఉపశమనం ఇస్తాయి. కరెంట్ లేకపోయినా లైట్, ఫ్యాన్ వంటి అవసరాలు సులభంగా నెరవేరుతాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us
