సెప్టెంబర్‌లో ఫైనల్ ఇయర్, సెమిస్టర్ పరీక్షలు: యూజీసీ

కోవిద్-19 కట్టడికోసం మార్చిలో వాయిదా వేసిన పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా మళ్లీ వాయిదా పడవచ్చని భావించొద్దని, రాసేందుకు సన్నద్ధం కావాలని యూజీసీ సూచించింది.

సెప్టెంబర్‌లో ఫైనల్ ఇయర్, సెమిస్టర్ పరీక్షలు: యూజీసీ

కోవిద్-19 కట్టడికోసం మార్చిలో వాయిదా వేసిన పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా మళ్లీ వాయిదా పడవచ్చని భావించొద్దని, రాసేందుకు సన్నద్ధం కావాలని యూజీసీ సూచించింది. సెప్టెంబర్‌లో తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది తీర్పును శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన అభిషేక్‌ మను సింఘ్వీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే ఆప్షన్‌తో సహా పరీక్షలు నిర్వహించేందుకు యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు ఏకపక్షంగా ఉన్నాయని వాదించారు.

చాలా యూనివర్సిటీలలో సదుపాయాలు లేవని, అందువల్ల ఆన్‌లైన్‌ పరీక్షలు ఏకరీతిగా నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ‘ఆప్షనల్‌ ఎగ్జామ్‌ సమస్యాత్మకంగా ఉంటుంది. ఎవరైనా హాజరుకాలేకపోతే.. తర్వాత ఆప్షన్‌ ఇస్తే అది గందరగోళం సృష్టిస్తుంది’ అని కోర్టు చెప్పింది. ‘కానీ ఇది విద్యార్థుల ప్రయోజనం కోసమే’నని పేర్కొంది. అనంతరం సింగ్వీ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించే విపత్తు నిర్వహణ చట్టంలోని విభాగాలను ప్రస్తావించారు.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

Click on your DTH Provider to Add TV9 Telugu