అడల్ట్ కంటెంట్‌నే నమ్ముకున్న పాయల్! 

‘ఆర్ఎక్స్100’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్.. ఇప్పుడు ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండింట్లోనూ పాయల్ గ్లామరే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అంతేకాక కథ కూడా పాయల్ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతోంది. ‘ఆర్ఎక్స్100’ సినిమాకు కథ, కార్తికేయ నటనతో పాటుగా పాయల్ గ్లామర్ ఎంత పెద్ద అసెట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకేనేమో ఈ ‘ఆర్‌డిఎక్స్ లవ్’లో కూడా రొమాన్స్‌కే […]

అడల్ట్ కంటెంట్‌నే నమ్ముకున్న పాయల్! 

Updated on: Oct 11, 2019 | 2:01 AM

‘ఆర్ఎక్స్100’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్.. ఇప్పుడు ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండింట్లోనూ పాయల్ గ్లామరే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అంతేకాక కథ కూడా పాయల్ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతోంది.

‘ఆర్ఎక్స్100’ సినిమాకు కథ, కార్తికేయ నటనతో పాటుగా పాయల్ గ్లామర్ ఎంత పెద్ద అసెట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకేనేమో ఈ ‘ఆర్‌డిఎక్స్ లవ్’లో కూడా రొమాన్స్‌కే పెద్ద పీట వేశారు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నపాటి ఊరి సమస్యను చూపించడం తప్ప మిగతాదంతా పాయల్ గ్లామర్‌పైనే ఫోకస్ పెట్టారు మేకర్స్. అంతేకాక పోస్టర్లలో కూడా పాయల్ అందాలను చూపిస్తూ యువతను ఎట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఈ ‘ఆర్‌డిఎక్స్ లవ్’ మళ్ళీ పాయల్‌కు హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.