బీహార్ ఎన్నికలు, నితీష్ పై రాళ్లు, ఉల్లిపాయలు విసిరిన గుంపు

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం నితీష్ కుమార్ కి చేదు అనుభవం కలిగింది. మధుబని జిల్లా హర్ లాఖిలో మంగళవారం ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఓటర్లలో కొందరు ఆయనపైకి రాళ్లు, ఉల్లిపాయలు విసిరారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా జరుగుతోందని, బహిరంగంగా లిక్కర్ అమ్ముతు న్నారని, కానీ మీ ప్రభుత్వం దీన్ని ఆపలేకపోతోందని ఓ వ్యక్తి కేకలు పెట్టాడు. ఈ వ్యక్తిని పట్టుకునేందుకు నితీష్ కుమార్ బాడీగార్డులు రాబోగా ఆయన వారించారు. ఆ వ్యక్తి […]

బీహార్ ఎన్నికలు, నితీష్ పై రాళ్లు, ఉల్లిపాయలు విసిరిన గుంపు

Edited By:

Updated on: Nov 03, 2020 | 5:40 PM

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం నితీష్ కుమార్ కి చేదు అనుభవం కలిగింది. మధుబని జిల్లా హర్ లాఖిలో మంగళవారం ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఓటర్లలో కొందరు ఆయనపైకి రాళ్లు, ఉల్లిపాయలు విసిరారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా జరుగుతోందని, బహిరంగంగా లిక్కర్ అమ్ముతు న్నారని, కానీ మీ ప్రభుత్వం దీన్ని ఆపలేకపోతోందని ఓ వ్యక్తి కేకలు పెట్టాడు. ఈ వ్యక్తిని పట్టుకునేందుకు నితీష్ కుమార్ బాడీగార్డులు రాబోగా ఆయన వారించారు. ఆ వ్యక్తి ఎన్ని రాళ్లు, ఉల్లిపాయలు విసరగలుతాడో విసరనివ్వండి,, అతడిని ఆపకండి అని అన్నారు. ఈ సంఘటనతో కొద్దిసేపు అక్కడ కలకలం రేగింది.