ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఎస్‌బీఐ షాకింగ్ డెసిషన్!

|

Aug 20, 2019 | 3:21 PM

డెబిట్ కార్డులను పూర్తిగా తప్పించే దిశలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్ని కసరత్తు చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) క్రమంగా కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించే వైపు అడుగులు వేస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు ఎస్‌బీఐ […]

ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఎస్‌బీఐ షాకింగ్ డెసిషన్!
Follow us on

డెబిట్ కార్డులను పూర్తిగా తప్పించే దిశలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్ని కసరత్తు చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) క్రమంగా కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించే వైపు అడుగులు వేస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

మరోవైపు ఎస్‌బీఐ కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించింది. పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కారు లోన్ తీసుకునే వారికి 8.70 శాతం వడ్డీ రేటు నుంచే లోన్ ఇస్తామని.. అంతేకాకుండా రూ.20 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలపై కూడా 10.75 వడ్డీ రేటుతో మొదలుకుని ఆరేళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో లోన్‌ను అందించనున్నట్లు తెలిపింది. రూ.50 లక్షల దాకా ఎడ్యుకేషన్ లోన్ కూడా 8.25 శాతం వడ్డీ నుంచి మొదలకుని 15 ఏళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో మంజూరు చేస్తామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.