SRSP: కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీటిని, తాగునీరు అందించే ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. హన్మకొండలోని గుండ్ల సింగారం వద్ద కాలువకు బుంగ పడింది. దీంతో నీరు భారీగా కిందనున్న గుండ్ల సింగారం కాలనీలోకి ప్రవహిస్తోంది. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం గురించి ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా భారీగా కాలువ నీరు కాలనీల్లోకి వస్తుండడంతో మరో రెండు, మూడు కాలనీలు నీట మునిగే అవకాశం ఉంది.