శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు

|

Jul 15, 2020 | 12:01 PM

బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కన్నడనాట కదం తొక్కుతున్న కృష్ణమ్మ.. ఆల్మట్టి, నారాయణపూర్‌లను నింపుకుని..

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు
Follow us on

Srisailam Dam : బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కన్నడనాట కదం తొక్కుతున్న కృష్ణమ్మ.. ఆల్మట్టి, నారాయణపూర్‌లను నింపుకుని.. తెలంగాణను ముద్దాడుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం  49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులకు చేరింది.  నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు