Srinagar Jammu Snowfall: భారీ హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న కాశ్మీర్.. అద్భుతమైన వీక్షణం అంటున్న కేంద్ర మంత్రి

|

Jan 10, 2021 | 4:19 PM

కాశ్మీర్ లోయ మంచు దుప్పటి కప్పుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న హిమపాతంలో కాశ్మీర్ ధవళకాంతులతో మెరిసిపోతుంది. రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కొత్త అందాలు వచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో...

Srinagar Jammu Snowfall: భారీ హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న కాశ్మీర్.. అద్భుతమైన వీక్షణం అంటున్న కేంద్ర మంత్రి
Follow us on

Srinagar Jammu Snowfall: కాశ్మీర్ లోయ మంచు దుప్పటి కప్పుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న హిమపాతంలో కాశ్మీర్ ధవళకాంతులతో మెరిసిపోతుంది. రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కొత్త అందాలు వచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. రోడ్లపై పేరుకున్న మంచుతో శ్రీనగర్ జమ్ము జాతీయ రహదారి పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ యంత్రాల సాయంతో మంచుని తొలగించారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్లే వన్-వే ట్రాఫిక్ కి మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నామని అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతంతో మంచు, కొండచరియలు , రాళ్లు విరిగి పడడంతో జనవరి 3 నుంచి జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే..

తాజా కాశ్మీర్ అందంపై కేంద్ర మంత్రి స్పందించారు. శ్రీనగర్ లోని రైల్వే ట్రాక్ లు మంచుతో కప్పబడి ఉన్నాయి. రైల్వే కార్మికులు ఓ వైపు మంచుని క్లియర్ చేస్తూ మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు ఈ శీతాకాలంలో అత్యంత అద్భుతమైన వీక్షణం అంటూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఓ వీడియో పోస్ట్ చేశారు.

Also Read: అవును భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే..త్వరలో లెక్క సరి చేస్తామంటున్న హిలాలీ