వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

|

Mar 13, 2019 | 7:41 AM

హైదరాబాద్‌: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 94 వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 1నుంచి జూన్‌ 29 మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-విశాఖపట్నంల మధ్య 26 రైళ్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడకు వెళ్లకుండా వయా రాయనపాడు మీదుగా ఇవి రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-విశాఖపట్నంల మధ్య 26, జబల్‌పూర్‌-తిరునల్వేలి, తిరునల్వేలి-జబల్‌పూర్‌ల మధ్య 26, మచిలీపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మచిలీపట్నంల మధ్య 8, నర్సాపూర్‌-హైదరాబాద్‌, […]

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
Follow us on

హైదరాబాద్‌: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 94 వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 1నుంచి జూన్‌ 29 మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-విశాఖపట్నంల మధ్య 26 రైళ్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడకు వెళ్లకుండా వయా రాయనపాడు మీదుగా ఇవి రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-విశాఖపట్నంల మధ్య 26, జబల్‌పూర్‌-తిరునల్వేలి, తిరునల్వేలి-జబల్‌పూర్‌ల మధ్య 26, మచిలీపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మచిలీపట్నంల మధ్య 8, నర్సాపూర్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-నర్సాపూర్‌ల మధ్య నాలుగు, హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైలు సర్వీసులను తిప్పనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.