వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌..!

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో

వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌..!

Edited By:

Updated on: Apr 06, 2020 | 4:54 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. వృద్ధుల కోసమైతే 14567 నెంబర్‌కు, దివ్యాంగుల కోసం 1800-572-8980కు ఫోన్‌చేయాలని దివ్యాంగుల , వయోవృద్దుల సంక్షేమశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని ఏ మూల నుంచయినా దివ్యాంగుల, వృద్ధుల అవసరాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే ఆ ఫోన్‌కాల్‌ రికార్డు చేసి దానిని వారి జిల్లా సంక్షేమఅధికారికి బదిలీచేస్తారు.

కాగా.. జిల్లా సంక్షేమ అధికారి , వారి సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి సహాయ సహకారాలు అందిస్తారని అదికారులు తెలిపారు. అంతే కాకుండా ఏమైనా వైద్య సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 104కి ఫోన్‌ చెయాలని,రాష్ట్ర దివ్యాంగుల, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. కరోనా మహమ్మారి పై ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధంలో యుద్ధంలో ప్రజలు, ప్రభుత్వము, వైద్య బృందాలు, పోలీస్‌శాఖ, మున్సిపల్‌సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తారని అన్నారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ వారికి కావల్సిన నిత్యావసర వస్తువులతో పాటు మెడిసిన్‌, మాస్కులను, శానిటైజర్లను, డైపర్స్‌లను పంపిణీ చేస్తామని తెలిపారు.