AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన సేవకుడు..జగన్ రాజకీయ ప్రస్థానం

వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి..నేటి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుంచి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత జతచేయబడుతోంది. ఆయన ప్రతి సంతకం ఒక చరిత్రగా లిఖించబడుతోంది. అయితే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు. ఈ విజయం వెనుక జగన్ 10 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, వేధింపులు, జైలు జీవితం, కుటుంబ సభ్యలపై చౌకబారు విమర్శలు. జగన్ అన్నింటీని ఎదుర్కొన్నాడు. ప్రతి సమస్యకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. అసెంబ్లీలో అడుగులు […]

జన సేవకుడు..జగన్ రాజకీయ ప్రస్థానం
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 30, 2019 | 12:53 PM

Share

వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి..నేటి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుంచి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత జతచేయబడుతోంది. ఆయన ప్రతి సంతకం ఒక చరిత్రగా లిఖించబడుతోంది. అయితే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు. ఈ విజయం వెనుక జగన్ 10 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, వేధింపులు, జైలు జీవితం, కుటుంబ సభ్యలపై చౌకబారు విమర్శలు. జగన్ అన్నింటీని ఎదుర్కొన్నాడు. ప్రతి సమస్యకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. అసెంబ్లీలో అడుగులు కొత్తగా వేసినా..అధికారపక్షంపై తిరుగులేని దాడి చేశాడు. ప్రజా సమస్యలు గుర్తించడంపై, వాటికి పరిష్యారాలు చూపించడంపై జగన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనేది రాజకీయ నిపుణుల మాట. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుపై పోరాటం ఆశామాషి కాదు. కానీ జగన్ మడమ తిప్పలేదు..మాటలో వాడి తగ్గలేదు. తమ పక్షంలో సీనియారిటీ, వాగ్ధాటి ఉన్న ఎమ్మెల్యేలు లేకున్నా అసెంబ్లీలో అధికార పక్షానికి దీటైనా సమాధానాలు ఇచ్చి ప్రజల మన్ననలు అందుకున్నాడు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి తెస్తానని జనాల్లో నమ్మకాన్ని తెచ్చుకోవడంలో జగన్ పూర్తి సక్సెస్ అయ్యారు.

ఇద్దరితో మొదలై.. కేవలం ఇద్దరు ప్రజాప్రతినిధులతో స్థాపించిన పార్టీని అలుపెరగని ప్రజా పోరాటాలతో అఖండ మెజార్టీతో అధికారంలోకి తేవడం వైఎస్‌ జగన్‌కే సాధ్యమైంది. నమ్మిన ఆశయాల సాధన కోసం నాడు కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు వైఎస్‌ జగన్, విజయమ్మలు రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వచ్చారు. ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో కడప ఎంపీగా ఎన్నికకాగా, వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల భారీ మెజార్టీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న జగన్‌ వైఎస్సార్‌సీపీని స్థాపించారు. అలా ఇద్దరు ప్రజాప్రతినిధులతో మొదలైన పార్టీ రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగింది. రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ జగన్‌పై విశ్వాసంతో 17 మంది ఎమ్మెల్యేలు నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ సీట్లతోపాటు నెల్లూరు ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అనంతరం 2014 ఎన్నికల్లో  కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన వైఎస్సార్‌సీపీ 67 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ స్థానాల్లో నెగ్గి బలమైన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించింది. ఐదేళ్లపాటు జగన్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వచ్చారు. పార్టీని స్థాపించినప్పటి నుంచి జగన్ పట్ల ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్ర చేసినా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం దీక్షలు, ధర్నాలు చేసినా, ఆయన బయటకు వస్తే చాలు జనసందోహం పోటెత్తుతోంది.

అఖండ విజయం..

ఈ ఎన్నికల్లో ఒంటిచేత్తో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టిన వైఎస్‌ జగన్‌ దాదాపు 50 శాతం ఓట్లతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. ఏకంగా 86 శాతం సీట్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం విశేషం. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల ఘన విజయం సాధించింది. అతి తక్కువ మెజార్టీలతో పార్టీ ఓడిన మూడు ఎంపీ సీట్లలో కూడా రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు వివాదాస్పదం కావడం గమనార్హం. 100కిపైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఓ పార్టీ 86 శాతం సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ 1994 ఎన్నికల్లో 68 శాతం సీట్లు గెలుచుకోవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. దీన్ని బద్ధలుకొడుతూ వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఏకంగా 86 శాతం సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.