లిక్విడ్ వద్దు.. జెల్ మాత్రమే విక్రయించాలి…

|

Aug 11, 2020 | 3:28 PM

'లిక్విడ్‌ శానిటైజర్‌' బదులు 'జెల్‌ శానిటైజర్లు' మాత్రమే అమ్మాలంటూ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు. పట్టణంలోని పలు మెడికల్‌ షాపుల్లో ఆయన..

లిక్విడ్ వద్దు.. జెల్ మాత్రమే విక్రయించాలి...
Follow us on

Sell Gel Sanitizers Instead of Lliquid : ‘లిక్విడ్‌ శానిటైజర్‌’ బదులు ‘జెల్‌ శానిటైజర్లు’ మాత్రమే అమ్మాలంటూ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు. పట్టణంలోని పలు మెడికల్‌ షాపుల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ మరణాల తరువాత స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లుగా వెల్లడించారు. మెడికల్‌ షాపుల వద్ద ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శానిటైజర్‌ తయారీదారులు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, మెడికల్‌ షాపుల అసోసియేషన్లతో మాట్లాడి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

మద్యం అక్రమ సరఫరాలో పాత నిందితుల్ని బైండోవర్‌ చేస్తున్నామని చెప్పారు. ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు సత్తెనపల్లి అర్బన్‌ సీఐ ఎస్‌.విజయచంద్ర, సిబ్బంది ఉన్నారు.