ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. బాలు ఆరోగ్యపరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందంటున్న డాక్టర్లు.. నిమిషం నిమిషానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని చెబుతున్నారు. మరికాసేపట్లో బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి పై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేయనున్నారు. బాలుకి ఇప్పటికీ ఎక్మో వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు పక్కనే ఆయన కుమారుడు చరణ్, భార్య సావిత్రి ఆస్పత్రిలో ఉన్నారు. మరికాసేపట్లో బాలు చిరకాల మిత్రుడు భారతీరాజా.. ఆసుపత్రికి రానున్నారు. ఇప్పటికే నటుడు కమల్ హాసన్ ఆసుపత్రికి వచ్చి వెళ్లగా, ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనని బాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.